సీఈసీ రాజీనామా చేయాలి.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు, మాజీ సర్పంచ్ వంటిపెంటి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ఓట్లను ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశవ్యాప్తంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఎం అఖిల భారత నాయకులతో పాటు యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. సీపీఎం కేంద్ర కార్యాలయంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు స్వామి, యాదిరెడ్డి, రాంరెడ్డి, సంఘపాక స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, లోడి గోపాల్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments