విధి నిర్వహణలో విశేష ప్రతిభ.. 120 మంది పోలీస్ సిబ్బందికి ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రశంసా పత్రాల

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచి, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో విశేష సేవలు అందించిన మొత్తం 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ముఖ్యంగా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో, అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా న్యాయవాదన చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డిని, భువనగిరి కోర్టులో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఎస్పీ అభినందించారు. అదేవిధంగా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసుల కృషితో పాటు, గుండాల పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఎస్సీ/ఎస్టీ కేసులో నిందితుడికి శిక్ష పడేలా న్యాయపరంగా కృషి చేసిన నల్గొండ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు, వివిధ సైబర్ నేరాలను ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించి బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, వృత్తి నైపుణ్యం కనబరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అభినందనలకు అర్హులు. నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన న్యాయవాదన ఎంతో కీలకం. ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేసే సిబ్బంది సేవలను గుర్తించి ప్రోత్సహించడం పోలీస్ శాఖ బాధ్యత. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి” అని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments