గత నెల 21, 29 తేదీలలో వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డీజిల్ దొంగతనం కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కేసులో నిందితుడిని తెలివిగా, అతి తక్కువ సమయంలోనే పట్టుకుని దర్యాప్తును పూర్తి చేసినందుకు గాను సోమవారం ఆకాంక్ష్ యాదవ్ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కృషి,నిబద్ధత అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా నేరాల నియంత్రణకు కృషి చేయాలని కోరారు. పోలీసు శాఖలో ఇలాంటి చురుకైన అధికారులు ఉండటం వల్ల ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
