ఇండియా కూటమి నేతలకు నో అపాయింట్‌మెంట్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు. అక్టోబర్ 12 న సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమావేశమై, ఎన్నికల అక్రమాలపై మెమోరాండం సమర్పించేందుకు ఇరువురు నేతలు లేఖ రాశారు. సీజేఐ కార్యాలయం ఈ అభ్యర్థనను కారణాలతో సహా ఈమెయిల్ ద్వారా తిరస్కరించింది. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్...