సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు. అక్టోబర్ 12 న సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమావేశమై, ఎన్నికల అక్రమాలపై మెమోరాండం సమర్పించేందుకు ఇరువురు నేతలు లేఖ రాశారు. సీజేఐ కార్యాలయం ఈ అభ్యర్థనను కారణాలతో సహా ఈమెయిల్ ద్వారా తిరస్కరించింది. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్ చోరీ’ ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న డిమాండ్లను నేతలు సీజేఐ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. సంబంధిత అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్నందున, పరిపాలనా మార్గంలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని సీజేఐ స్పష్టం చేసినట్లు సమాచారం. తమ హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన ప్రక్రియ ద్వారా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. మరోవైపు, ఈ అంశాలపై ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు మార్చ్‌కు సిద్ధమయ్యారు.